విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్కరణలు చేపట్టింది. వీలైతే 8వ తరగతి వరకూ కూడా ఇదే పద్ధతిలో కొనసాగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో టీడీపీ అనుకూల మీడియా.. బాబు & కో సంబరాలు చేసేస్తుకుంటున్నారు. దానికి కారణం… ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని జగన్ సర్కార్ అమలు చేయాలనుకోవడం, దానికి తాజా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గండిపడుతుందనేది వారి ఆనందం!
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే కచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకోవడంవల్ల భవిష్యత్తు బాగుంటుందనేది జగన్ కల! అందులో భాగంగానే విద్యావ్యవస్థలో సంస్కరణ తీసుకురావాలని ప్లాన్ చేశారు. కొందరి రాక్షసానందం వల్ల, స్వార్థరాజకీయాల వల్ల దానికి కోర్టుల ద్వారా అడ్డుపడుతూనే ఉన్నారు. నేడు కేంద్రం నుంచి కూడా అలాటి ప్రకటనే వచ్చింది!
తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పిల్లలంతా తెలుగులోనే చదువు కోవడం వల్ల జగన్ కు వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీ లేదు. జగన్ కూతుళ్లిద్దరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని… ప్రస్తుతం అమెరికా, ఇంగ్లండ్ లలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో చదువుకుంటున్నారు. కానీ ఈ నిర్ణయం ఫలితంగా, జగన్ కల చెదరడం వల్ల నష్టపోయేదల్లా బడుగు, బలహీన వర్గాల పిల్లలు మాత్రమే.
వాళ్లేప్పుడూ అక్కడే ఉండాలని కలలు కంటున్నవారు మాత్రం… కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సంబరాలు చేసుకుంటూ… ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు లాంటి వారు ఆనందాలు వ్యక్తపరచడాన్ని ఏమనాలి? ఇది ఎవరిపైన కక్షగా భావించాలి? బాబుకు, ఆయనతోపాటు ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నవారికీ తెలియాలి!!