భూభూమి పూజ కు వారణాసి నుండి వెండి ఆకులు..!

-

హిందువులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఈ నెల 5వ తేదీన భూమి పూజ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. కొంతమంది అతిథులు మరికొంతమంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి కూడా. అయోధ్య భూమి పూజ నిర్మాణం నేపథ్యంలో ఇప్పటికే సమీప ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే,

అయితే అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఈ నెల 5న జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి వెండి ఆకులను వినియోగించినట్లు తెలుస్తోంది. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందిన వారు వెండితో ప్రత్యేకంగా ఐదు ఆకులను తయారు చేయించారు, సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరాసియా వీటిని వేదపండితులకు అందజేయనున్నట్లు సమాచారం. బంగారం వెండితో చేసిన ఆకులు పుష్పాలు పూజలకు వినియోగించడం హిందూ సంప్రదాయం అని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news