డ్రగ్ తయారీ సంస్థ లుపిన్.. కోవిహాల్ట్ పేరిట కోవిడ్ మెడిసిన్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఫావిపిరవిర్ ఉంటుంది. కోవిహాల్ట్ మెడిసిన్ ఒక్క ట్యాబ్లెట్ ధరను రూ.49గా నిర్ణయించారు. కోవిడ్ స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న పేషెంట్ల చికిత్సకు ఈ మెడిసిన్‌ను ఉపయోగిస్తారు. ఇందుకు గాను లుపిన్ ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు పొందింది.
కోవిహాల్ట్ మెడిసిన్ 200 మిల్లీగ్రాముల డోసులో లభిస్తోంది. స్ట్రిప్‌కు 10 ట్యాబ్లెట్లు ఉంటాయి. ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.49కి విక్రయిస్తారు. ఈ సందర్భంగా లుపిన్ ఇండియా రీజియన్ ఫార్ములేషన్స్ ప్రెసిడెంట్ రాజీవ్ సిబాల్ మాట్లాడుతూ.. తమకు దేశవ్యాప్తంగా బలమైన నెట్‌వర్క్ ఉందని, అందువల్ల ఈ మెడిసిన్‌ను సులభంగా పేషెంట్లకు అందేలా చూస్తామన్నారు.
కాగా ఆగస్టు 4న సన్ ఫార్మా కంపెనీ ఇదే ఫావిపిరవిర్ మందును ఫ్లూగార్డ్ పేరిట ఒక్కో ట్యాబ్లెట్‌ను రూ.35కు అమ్మడం మొదలు పెట్టింది.