బ్రేకింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు..!

-

బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారనే నేపధ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి లను హైదరాబాదు శివారుప్రాంతం శంషాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసందే. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయం మొత్తం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. అయితే తాజాగా.. వీరికి అనంతపురం జిల్లా కోర్టు బుధవారం నాడు బెయిల్ మంజూరు చేసింది.

దీంతో వీరు రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజుల క్రితం వీరు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో అనంతపురం జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిని పరిశీలించిన కోర్టు ఎట్టకేలకు వీరికి బెయిల్ మంజూరు చేసింది. కాగా, వీరి అరెస్టుపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news