మున్సిఫ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ ఇన్‌ చీఫ్ ఖాన్ లతీఫ్ ఖాన్ మృతి

-

మున్సిఫ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ ఖాన్ లతీఫ్ ఖాన్ అమెరికా చికాగోలోని తన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. 80 ఏళ్ల ఖాన్ లతీఫ్ ఖాన్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మున్సిఫ్‌ పత్రికను 1996లో కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఎడిటన్ ఇన్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సికింద్రాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. సుల్తాన్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్‌, ఖాన్ లతీఫ్ ఖాన్ మంచి స్నేహితులు.

Lathif ఖాన్
Lathif khan

దేశవ్యాప్తంగా ఈ ఉర్దూ పత్రికకు అనేక మంది పాఠకులు ఉన్నారు.లతీఫ్ ఖాన్ ఎప్పటికప్పుడు రాజకీయ, సామాజిక అంశాలపై ఎడిటోరియల్ కాలం రాస్తూ ఉంటారు. వీటిలో సామాజిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది, అందుకే లతీఫ్ ఖాన్ ను సామాజిక వేత్త గా ప్రజలు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news