ఇప్పటికే బ్రిటిష్ వారు భారతదేశానికి చెందిన అపురూపమైన కోహినూర్ వజ్రాన్ని దొంగలించి తమ దేశంలో భద్రపరుచుకున్నారని ఎంతో మంది వారిని ఆడిపోసుకుంటుంటారు. ఇక ఇదే సమయంలో భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ వాడిన బంగారపు పూత పూసిన వృత్తాకారంలో ఉండే కళ్ళద్దాలు ఇప్పుడు ఒకటి బయట పడ్డాయి.
1910 నుండి 1930 మధ్యలో సౌత్ ఆఫ్రికా లోని బ్రిటిష్ పెట్రోలియం లో పని చేస్తున్న తన అంకుల్ కు తన తండ్రి ఇది గిఫ్ట్ ఇచ్చినట్లు ప్రస్తుతం దీనిని పొందిన ఒక విక్రయదారుడు తెలిపారు. ఇక అతను చెబుతున్న కథకం ప్రకారం…. గాంధీ ఈ రకం కళ్లద్దాలను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే వాడారు. 1910 నుండి 1920 మధ్యలో గాంధీ అసలు కళ్లద్దాలు వేసుకొనే లేదు. కాబట్టి అంతకుముందే వాళ్ళ నాన్నగారు చెప్పిన కథ ప్రకారమే గాంధీ ఈ కళ్లద్దాలను దక్షిణాఫ్రికా లో ఉపయోగించి ఉంటారని…. అయితే ఎలాగో అది తిరిగి తిరిగి వారి నాన్న గారి దగ్గరికి వచ్చి 1920 తర్వాత వేలానికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే…. ప్రస్తుతం అతను దీనికి వేలం నిర్వహించి కొంత మొత్తం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా వేలంలో ఈ కళ్ళద్దాలు ఎన్ని పౌండ్లకు అమ్ముడుపోతాయి అని అంచనా కి వచ్చినప్పుడు అతను ఆ అంచనా మొత్తం విని ఎగిరి గంతేశాడు. 1900ల్లో గాంధీ వాడిని కళ్ళద్దాలు ప్రస్తుతం 10 వేల నుండి పదివేల పౌండ్ల వరకు వేలంలో అమ్ముకోవచ్చని అంచనా వేయగా అంతకు మించి కూడా వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.
ప్రస్తుతం ఆన్లైన్ బిడ్ లోనే ఆరు వేల పౌండ్లు పెట్టి దీనికోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. ఇక భారత దేశానికి కోహినూర్ వజ్రం కన్నా ఇది ఎంతో అపురూపమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కూడా ఎలాగో బ్రిటీష్ వారి వద్దకు వెళ్ళగా ఈ కళ్లద్దాలను వారు డబ్బుల కోసం ఉపయోగించుకుంటున్నారని…. అదే భారతదేశంలో ఉండి ఉంటే ఎంతో గొప్పగా దానిని మ్యూజియం లో ఉంచి గాంధీ గౌరవాన్ని రెట్టింపు చేసేవారిమని భారతీయులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఈ వేలంలో దీనిని భారతీయులే కొని మన ప్రభుత్వానికి ఈ అపురూపమైన కళ్ళద్దాలను ఎవరనా ఇచ్చేస్తారేమో చూడాలి.