దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. అది ఏంటో చూద్దామా ఒక్కసారి. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తారా? కంపెనీ నుంచి సాలరీ అకౌంట్ ఉందా? సాధారణంగా ఉద్యోగంలో చేరిన వారికి కంపెనీ సాలరీ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తాయి. అంతేకాదు సాలరీ అకౌంట్స్‌కి ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయని తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సాలరీ అకౌంట్‌ని అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..
అయితే ఈ అకౌంట్‌కు కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ’ అని పేరు నామకరణం చేసింది ఎస్బీఐ. ఈ అకౌంట్ సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం పేర్లతో నాలుగు వేరియంట్స్‌లో అందజేస్తుంది. ఉద్యోగికి వచ్చే వేతనాన్ని బట్టి ఈ నాలుగు అకౌంట్లలో ఒకటి వర్తిస్తుందన్నారు. గ్రాస్ మంత్లీ ఇన్కమ్ అంటే బేసిక్ సాలరీతో పాటు అలవెన్సులు అన్నీ కలిపి ఎంత జీతం వస్తుందో దాన్ని బట్టి అకౌంట్ తీసుకోవచ్చునన్నారు.
అంతేకాదు రూ.1,00,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి ప్లాటినం, రూ.50,000 నుంచి రూ.1,00,000 ఆదాయం ఉన్నవారికి డైమండ్, రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఆదాయం ఉన్నవారికి గోల్డ్, రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ఆదాయం ఉన్నవారికి సిల్వర్ అకౌంట్ కేటాయిస్తుందని ఎస్బీఐ యాజమాన్యం తెలిపారు.
అయితే మీరు ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మరో ఉద్యోగానికి మారినా ఆ అకౌంట్ కొనసాగించొచ్చునన్నారు. ఇందుకోసం మీరు మీ కొత్త కంపెనీలో ఎస్బీఐ సాలరీ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మీ కొత్త కంపెనీ యాజమాన్యం బ్యాంక్ బ్రాంచ్‌కు సమాచారాన్ని పంపి వివరాలను అప్డేట్ చేయిస్తుందని తెలిపారు.
అయితే ఇంకా మీ అకౌంట్లో వరుసగా మూడు నెలలు జీతం పడకపోతే సాలరీ అకౌంట్ ద్వారా లభించే బెనిఫిట్స్ కోల్పోతారు. సాలరీ అకౌంట్ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా మారిపోతుంది. ఆ తర్వాత సేవింగ్స్ అకౌంట్‌కు ఉండే ఛార్జీలన్నీ వర్తిస్తాయి. ఒకవేళ మీకు ఎస్బీఐ సాలరీ అకౌంట్ కావాలంటే మీ కంపెనీ ద్వారానే బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక సంస్థ నుంచి కనీసం 25 మంది ఉద్యోగులు ఉంటేనే సాలరీ అకౌంట్ అందిస్తుందని ఎస్బీఐ యాజమాన్యం తెలిపారు.