నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఇండియ‌న్ ఆర్మీ, సీఐఎస్ఎఫ్‌, రైల్వేల‌లో ఖాళీలు..

-

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా ? ఉద్యోగం లేక ఇబ్బందులు ప‌డుతున్నారా ? ఎంతో కాలంగా ప్ర‌భుత్వం ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా ? అయితే మీ కోస‌మే అనేక ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో తాజాగా ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేశారు. మ‌రింకెందుకాల‌స్యం.. వెంట‌నే ఆయా ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఏయే విభాగాల్లో ఏయే పోస్టులు ఖాళీ ఉన్నాయో తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసి.. ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని సాధించండి.

job notifications in various central government sectors

SSB కానిస్టేబుల్

SSB Recruitment 2020: ఎస్ఎస్‌బీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2020కి గాను ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ఆరంభ‌మైంది. ఇందుకుగాను భిన్న విభాగాల్లో మొత్తం 1522 కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు అప్లై చేసేందుకు ఆఖ‌రి తేదీని 2020 ఆగ‌స్టు 27గా నిర్ణ‌యించారు.

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2020:

భార‌త ఆర్మీలో ప‌నిచేయ‌టానికి సోల్జర్ డి. ఫార్మా & సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ మరియు నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోటాలోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఈమేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవ‌చ్చు. దరఖాస్తును చివరి తేదీ 22-09-2020

SECR రిక్రూట్‌మెంట్ 2020

సౌత్ ఈస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 432 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు సౌత్ ఈస్ట్ రైల్వేస్ సంస్థ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 30.08.2020.

CISF కానిస్టేబుల్ / ట్రేడ్స్‌మన్

CISF కానిస్టేబుల్ ప‌రీక్ష మ‌రోసారి వాయిదా ప‌డింది. కొత్త పరీక్ష తేదీని ఖ‌రారు చేస్తూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప‌రీక్ష‌ను 6 సెప్టెంబ‌ర్ 2020న నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించామ‌ని ప్ర‌క‌టించారు. పూర్తి వివ‌రాల‌ను CISF అధికారిక వెబ్‌సైట్‌లో పొందుప‌రిచిన‌ట్లు తెలిపారు.

ఎన్‌హెచ్‌బి రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్‌

నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌లో 11 స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. అభ్యర్థులందరూ ఆగస్టు 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేట్, B.A, LLB, CA, M.A, MBA / PGDM, PG డిప్లొమా చేసిన వారిని అర్హులుగా ప్ర‌క‌టించారు.

Rajasthan Postal Circle GDS

వివిధ విభాగాలలో గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఖాళీల భర్తీకి భారత ప్రభుత్వం, రాజస్థాన్ పోస్టల్ సర్కిల్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల చేసింది. ఆ నోటిఫికేష‌న్ తేదీని పొడిగిస్తూ దరఖాస్తు చివ‌రి తేదీని ప్రక‌టించారు. ఈ మేర‌కు చివ‌రి తేదిని 06-08-2020గా నిర్ణ‌యించారు. మొత్తం 3262 జిడిఎస్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆన్‌లైన్ ద్వారా ద‌రాఖాస్తు చేసుకోవ‌చ్చు. https://indiapostgdsonline.in.

క్యాబినెట్ సెక్రటేరియట్ ఫీల్డ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2020:

కేబినెట్ సెక్రటేరియట్ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల‌కోసం అభ్య‌ర్థుల‌నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేర‌కు 12 పోస్టుల నియామకానికి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో నివసించే అభ్యర్థులు అర్హులు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ్‌ని మార్గ‌ద‌ర్శ‌కాల‌మేర‌కు నింపి, దరఖాస్తు ఫారం ఆగస్టు 31 న లేదా అంతకు ముందు సెక్రటేరియట్‌కు చేరే విధంగా పంపాల్సిందిగా తెలిపింది.

SC Building Supervisor Recruitment 2020

సుప్రీం కోర్టులో బిల్డింగ్ సూప‌ర్ వైజ‌ర్ పోస్టుల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ.. ఆగ‌స్టు 29, 2020.

Read more RELATED
Recommended to you

Latest news