కరోనా నేపథ్యంలో మనలో అధికశాతం మందికి ప్రస్తుతం ఇప్పటి వరకు తెలియని కొత్త కొత్త పదాలు పరిచయం అయ్యాయి. క్వారంటైన్ అని, సోషల్ డిస్టన్సింగ్ అని.. కోవిడయట్స్ అని.. పాండెమిక్ అని.. అనేక కొత్త పదాలను చాలా మంది నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా Airgasm (ఎయర్‌గాజం) అనే కొత్త పదం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే.. ఇంతకీ అసలు ఈ పదానికి అర్థం ఏమిటంటే..?
కోవిడ్ 19 నేపథ్యంలో చాలా మంది మాస్కులను ధరిస్తున్నారు కదా. ఇక వైద్య సిబ్బంది అయితే ఒక్కసారి మాస్కు పెట్టుకుంటే గంటల తరబడి ధరించే ఉంటారు. డ్యూటీ అయ్యాక గానీ వారు మాస్కులను తీయడం లేదు. అయితే అలా చాలా సేపు మాస్కులను ధరించాక.. ఒక్కసారిగా మాస్కు తీసేస్తే మనం తాజా గాలిని పీల్చుకుంటాం కదా.. అప్పుడు తాజాదనపు అనుభూతి కలుగుతుంది. అవును.. సరిగ్గా ఆ ఫీలింగ్‌నే Airgasm అని పిలుస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో దీనికి కొందరు కొత్త కొత్త అర్థాలను కనిపెట్టడం మొదలు పెట్టారు.
Airgasm అంటే.. ముఖాన్ని గాలి బలంగా తాకడం అని కొందరు అంటున్నారు. అలాగే తాజా గాలిని పీల్చడం అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు మాస్క్ తీసేసిన వెంటనే గాలిని పీల్చుకోవడం అని అంటున్నారు.. అయితే ఎలా అన్నప్పటికీ అన్నింటికీ పైన తెలిపిన అర్థమే వస్తుంది.