దీపావళి సందర్భంగా సుప్రీం తీర్పుని అతిక్రమించిన 1300 మందిపై కేసు నమోదు..

-

తమిళనాడులో సుప్రీం తీర్పుని దిక్కరించిన 1300 మందిపై కేసులు నమోదయ్యాయి.  దేశంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దీపావళి పండుగ నాడు కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలసిందే. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఈనేప‌థ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన 1300 మందిపై కేసులు న‌మోదు చేశారు.  చెన్నైలో 350 మందిపై కేసులు,విల్లుపురం జిల్లాలో 50 మందిపై ఐపీసీ 188, 285 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ చేశారు.  దీపావళి పండుగ నాడు ఈ తరహా నిబంధన విధించడం పట్ల అటు టపాసుల వ్యాపారులు, సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే వివిధ పట్టణాల్లో పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news