ఇండియాకు యూఎన్ దీపావళి కానుక..

-

దీపావళి పర్వదినం సందర్భంగా భారతీయులకు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక బహుమతిని అందించింది.  దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఐక్యరాజ్యసమితి రెండు స్టాంపులను విడుదల చేసింది. ‘హ్యాపీ దీవాళి. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారతీయులు జరుపుకొనే దీపావళి పండుగ సందర్భంగా యూన్‌ స్టాంప్స్‌’  అంటూ అధికారికంగా ట్వీట్‌  చేసింది. దీంతో పాటు  హ్యాపీ దీవాళి అనే అక్షరాలతో కూడిన లైటింగ్‌లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం, దీపాలతో కూడిన స్టాంపుల ఫొటోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

యూఎన్‌ ట్వీట్‌పై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ స్పందిస్తూ… ‘ మేమెంతో ప్రత్యేకంగా భావించే, చెడుపై మంచి విజయానికి గుర్తుగా చేసుకునే పండుగ సందర్భంగా స్టాంప్స్‌ విడుదల చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news