షాకింగ్‌.. ఇళ్ల నుంచే ప‌నిచేయాల‌నుకుంటున్న 70 శాతం మంది ఉద్యోగులు..!

-

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అనేక కంపెనీల‌కు చెందిన ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఇంటి నుంచే విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఆఫీసుల‌కు వెళ్తున్నారు. అయితే ఎక‌నామిక్ టైమ్స్‌కు చెందిన జిఫెనో చేసిన స‌ర్వేలో.. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని భావిస్తున్నార‌ని వెల్ల‌డైంది.

70 percent employees interested in working from home

దేశంలోని 15 భిన్న‌మైన రంగాల‌కు చెందిన 550 కంపెనీల్లో ప‌నిచేస్తున్న 1800 మంది ఉద్యోగుల‌ను స‌ర్వే చేశారు. దీంతో వారిలో 70 శాతం మంది ఇంటి నుంచే ప‌నిచేయాల‌ని ఉంద‌ని తెలిపారు. కేవ‌లం 30 శాతం మాత్ర‌మే కార్యాల‌యాల‌కు వెళ్లాల‌ని ఉంద‌ని తెలిపారు. అయితే ఆ 30 శాతం మంది కూడా ఉన్న‌త స్థాయి ఉద్యోగాల్లో ప‌నిచేస్తున్న‌వారు కావ‌డం విశేషం. వారిలో చాలా మంది మేనేజ‌ర్ లెవ‌ల్‌లో ప‌నిచేస్తున్నారు. అందువ‌ల్లే వారు కార్యాల‌యాల‌కు వెళ్లాల‌ని కోరుకుంటున్నారు. ఇక మిగిలిన వారంద‌రూ సాధార‌ణ ఉద్యోగులు. ఈ క్ర‌మంలో వారు ఇంటి నుంచే పనిచేయాల‌ని ఉంద‌ని తెలిపారు.

అయితే క‌రోనా ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు ఇదే ట్రెండ్ కొన‌సాగుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఆ త‌రువాతే ఉద్యోగులు ఎలాంటి భ‌యం లేకుండా ఆఫీసుల‌కు వెళ్తార‌ని అంటున్నారు. క‌రోనాకు అతి త్వ‌ర‌లో వ్యాక్సిన్లు రానున్న నేప‌థ్యంలో.. ప్ర‌జ‌లంద‌రూ వ్యాక్సిన్లు తీసుకుంటే.. తిరిగి ఎప్ప‌టిలా కార్య‌క‌లాపాలు కొన‌సాగుతాయ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news