భారత 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కోవిడ్ 19 ఉన్నప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ పంద్రాగస్టు వేడుకలను జరుపుకున్నారు. అయితే కెనడాలోని నయాగారా ఫాల్స్‌లోనూ భారత త్రివర్ణ పతాకం ఆవిష్కృతమైంది. అక్కడి భారతీయులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.
నయాగారా ఫాల్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ ఇల్యూమినేషన్ బోర్డు ద్వారా జలపాతంలో భారత త్రివర్ణ పతాక రంగులను కనిపించేలా చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను టొరంటోలోని భారత కాన్సులేట్ షేర్ చేసింది. ఈ సందర్బంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడె కెనడా భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
And the tri-colour illuminates one of the world’s most iconic destinations. India in all its magnificence at the Niagara Falls. #AatmaNirbharBharat @IndoCanadaArts @_apoorvasri @HCI_Ottawa @DrSJaishankar @PMOIndia @ICCR_Delhi @nadirypatel @IndianDiplomacy @incredibleindia pic.twitter.com/vG7JJo7Fqs
— IndiainToronto (@IndiainToronto) August 16, 2020
కోవిడ్ 19 ఉన్నప్పటికీ కెనడాలో అనేక చోట్ల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. సుమారుగా 10 లక్షల మంది భారతీయులు అక్కడ వేడుకల్లో పాల్గొన్నారు. పలువురు రహదారులపై ర్యాలీలు కూడా నిర్వహించారు.