బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ ?

-

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్ లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్  రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈరోజు కడప సెంట్రల్ జైల్ లో ఉన్న ఖైదీలు అందరి కి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా అందులో ఈయనకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సెంట్రల్ జైల్ లో సిబ్బంది ఖైదీలు అందరూ కలిపి 703 మంది ఉన్నారు.

జైలు అధికారులు మూడు విడతల్లో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో 317 మంది ఖైదీలకు , 14 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ అని తేలింది. ఆ కరోనా సోకిన ఖైదీల్లో ప్రభాకర్  రెడ్డి కూడా ఉన్నారు. ఖైదీలు అందరిని ప్రత్యేకంగా రెండు బ్లాకుల్లో పెట్టి జైల్ లోపలే చికిత్స అందిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఎవరికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవని జైల్ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news