అది దురదృష్టకరమైన నిర్ణయం..

-

పెద్దనోట్ల రద్దు గురువారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ… మోదీ తీసుకున్న దురదృష్టకరమైన నిర్ణయం కారణంగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావంతో పాటు అనేక అస్థలకు గురిచేసిన నోట్ల రద్దు దేశంలో ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చుతోందన్నారు. నాటి గాయం నేటి పుండుగా మారుతుందని విమర్శించారు.     ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్‌ 8న తీసుకున్న నిర్ణయం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై చూపిన వ్యతిరేక ప్రభావం ఈరోజుకీ కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన మచ్చలు, గాయాలు మాత్రం దురదృష్టవశాత్తూ… కాలంతో పాటు మరింతగా పెరుగుతూ వికృతంగా కనిపిస్తున్నాయి. జీడీపీ దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు  పెద్దనోట్ల రద్దు షాక్‌ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోయాయి. ఇలా ఒక్కటేంటి అన్ని వ్యవస్థలపై పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది అంటూ వివరించారు.

దీని ప్రభావాన్ని మనం ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎన్నడూ లేని విధంగా రూపాయి మరింత క్షీణించింది… అనాలోచిత  ఆర్థిక విధానాలు, నిర్ణయాలను అమలుచేస్తే వాటి ప్రభావం దీర్ఘకాలంలో దేశంపై ఎలా ఉంటుందోనన్న సత్యాన్ని ఈ రోజు గుర్తుచేస్తుంది’ అని మన్మోహన్‌ పేర్కొన్నారు. సామాజిక మాధ్యాల్లోనూ డిమానిటైజేషన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోదీ తీసుకున్న అత్యంత తెలివితక్కువ నిర్ణయం ఇది …దీని వల్ల నల్లడబ్బు ఏమైంది కానీ ఉన్న డబ్బు మాత్రం కంటికి కనపడటం లేదు అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news