గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో ‘సర్కార్’..!

-

Google search trends peak for 49P after the release of Sarkar

సర్కార్ సినిమా వసూళ్ల పరంగానే కాదు అటు గూగుల్ లోనూ ట్రెండ్ సృష్టిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన సర్కార్ సినిమాలో విజయ్, కీర్తి సురేశ్ జంటగా నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ రోల్ లో నటించింది. దీపావళి కానుకగా మంగళవారం రిలీజయిన ఈ సినిమా చాలా రికార్డులను కొల్లగొట్టింది.

Google search trends peak for 49P after the release of Sarkar

సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. బాహుబలి2 ఫస్ట్ డే కలెక్షన్లను కూడా ఈ సినిమా బీట్ చేసిందట. ఇక.. మరో రికార్డేమిటంటే.. గూగుల్ ట్రెండ్స్ లో సర్కార్ సినిమాలో ఉన్న ఓ సెక్షన్ టాప్ లో ఉంది. అవును.. సినిమాలో సెక్షన్ 49పీ గురించి చర్చ ఉంటుంది. అరె.. ఇటువంటి సెక్షన్ ఒకటుందా? మాకు తెలియదే? అంటూ గూగులమ్మకు పని చెప్పారు. దీంతో గూగుల్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో ఈ పదం వచ్చి చేరింది. దీనికి సంబంధించిన ఫోటోను సర్కార్ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news