సూర్యాపేట కాంగ్రెస్‌ లో వర్గ పోరు.. మాజీ మంత్రి Vs కాంగ్రెస్ ఎమ్మెల్యే !

-

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌ లో వర్గ పోరు షురూ అయింది. మాజీ మంత్రి Vs కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా వర్గ పోరు తెరపైకి వచ్చింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో‌ ఈ వర్గపోరు బయటపడింది. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మందుల సామేలును వైఖరికి వ్యతిరేకంగా, జాజిరెడ్డిగూడెంలో నేడు సమావేశం అయ్యారు అసమ్మతి నేతలు.

దగాపడ్డా కాంగ్రెస్ నాయకుల్లారా కదలిరండి పేరుతో సమావేశం నిర్వహించారు. అయితే.. ఈ అసమ్మతి నేతలకు మద్దతుగా నిలిచారు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఈ తరుణంలోనే… కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నూతనకల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. కొద్ది నెలలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోగా.. ఒక వర్గం ఎమ్మెల్యే మందుల సామేలు వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు ఈ సమావేశం పెట్టుకోవడం హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news