ఆయుధాలు వదిలేశా.. నేనిప్పుడు గాంధేయవాదిని : ఉగ్రవాది యాసిన్ మాలిక్

-

తాను 1994 నుంచే హింసను విదిలేశానని.. ఇప్పుడు గాంధేయవాదినని ఉగ్రవాది, వేర్పాటు వాది యాసిన్ మాలిక్ చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ట్రిబ్యునల్ కు తెలిపారు. శాంతియుత విధానాల్లోనే స్వతంత్ర, ఐక్య కశ్మీర్ ను సాధించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. మాలిక్ ప్రస్తుతం తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 1990లో భారత వాయుసేనకు చెందిన నలుగురు అధికారుల హత్యలో మాలిక్ ప్రధాన నిందితుడు.

మరోవైపు జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేదం విధించింది. దీనిని సమీక్షించిన ఉపా ట్రిబ్యునల్ రాబోయే ఐదేళ్ల పాటు ఆ సంస్థ పై నిషేదం ఉంటుందని తన ఉత్తర్వుల్లో ప్రకటించింది. ఆ క్రమంలోనే యాసిన్ ఈవిధంగా స్పందించారు. ఇదిలా ఉంటే.. 1990 జనవరి 25న పాత శ్రీనగర్ ఎయిర్ ఫీల్డ్ లో విధుల నిర్వహణకు సిద్దమైన వాయుసేన సిబ్బంది శ్రీనగర్ శివార్లలోని రావల్ పుర ప్రాంతలో పికప్ కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. మాలిక్ నాయకత్వంలోనే ఈ ఘాతుకం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news