బీసీసీఐ కి కొత్త చిక్కులు..డ్రీమ్ 11 లో చైనా భారీ వాటాలు

-

కరోనా కాలంలో ఐపీఎల్​ను నిర్వహించడానికి బీసీసీఐ సర్వప్రయత్నాలు చేస్తుంటే లీగ్ టైటిల్ స్పాన్సర్ షిప్ విషయంలో బోర్డుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారత్​-చైనా ఉద్రిక్త పరిస్థితుల నడుమ వివో ఈ ఏడాది స్పాన్సర్​షిప్ నుంచి తప్పుకుంది. తాజాగా ఆ స్థానంలో ఈ ఏడాదికి డ్రీమ్​ ఎలెవన్ ఒప్పందం ఖరారైంది. అయితే ఇప్పుడు ఈ కొత్త స్పాన్సర్​ కూడా చైనా వాటా కలిగి ఉందంటూ బీసీసీఐకి లేఖ రాసింది సీఏఐటీ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్).

dream11
dream11

ఐపీఎల్ 13వ సీజన్​కు గానూ డ్రీమ్​ ఎలెవన్ 222 కోట్లతో టైటిల్ స్పాన్సర్ షిప్ దక్కించుకుంది. ఇంతకుముందు చైనా మొబైల్ కంపెనీ వివో ఏడాదికి 440 కోట్లతో నాలుగేళ్ల పాటు ఒప్పందానికి అంగీకరించింది. కానీ భారత్-చైనా ఉద్రిక్తల మధ్య ఈ ఏడాది ఆ హక్కుల్ని రద్దు చేసుకుంది బీసీసీఐ.

Read more RELATED
Recommended to you

Latest news