స్విమ్​సూట్​లో క్రికెటర్ కేఎల్​ రాహుల్ ప్రేయసి..!

-

బాలీవుడ్​ నటి అతియా శెట్టితో టీమ్ఇండియా క్రికెటర్​ కేఎల్​ రాహుల్​ డేటింగ్​లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా అతియ ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​కు రాహుల్​ కామెంట్​ చేయడం వల్ల ఆ వార్తలకు బలం చేకూరుతోంది. స్విమ్​సూట్​లో ఉన్న మిర్రర్​ సెల్ఫీని అతియ ఇన్​స్టాలో పంచుకుంది. ఈ చిత్రానికి హార్ట్​ ఎమోజీతో ‘జెఫా’ అని కామెంట్​ చేశాడు రాహుల్​. దీని అర్థం ఏంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే స్పానిష్​ భాషలో దానికి ‘ బాస్​’ అని అర్థం.

kl rahul lover
kl rahul lover

రాహుల్​, అతియ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా.. వాటిపై ఈ జోడి నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే వారిద్దరి సోషల్​మీడియా పోస్టులు మాత్రం తరచూ వైరల్​ అవుతున్నాయి. ఇటీవలే రాహుల్​ పుట్టినరోజు సందర్భంగా అతియ శుభాకాంక్షలు తెలుపుతున్న పోస్టులో ‘అతను నా వ్యక్తి’ అని పేర్కొంది.

ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్​ పర్యటనలో కేఎల్​ రాహుల్​ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్​లో కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ జట్టుకు ఈ సారి నాయకత్వం వహించబోతున్నాడు.

 

View this post on Instagram

 

💜

A post shared by Athiya Shetty (@athiyashetty) on

Read more RELATED
Recommended to you

Latest news