అమెజాన్ పేలో కొత్త ఫీచ‌ర్‌.. కేవ‌లం రూ.5 కే బంగారం కొన‌వ‌చ్చు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ కు చెందిన అమెజాన్ పే లో కొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చారు. దీని వ‌ల్ల యూజ‌ర్లు కేవ‌లం రూ.5కే డిజిట‌ల్ రూపంలో బంగారం కొన‌వ‌చ్చు. అంటే బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చ‌న్న‌మాట‌. భౌతిక రూపంలో బంగారం కొనాలంటే అంత త‌క్కువ మొత్తానికి సాధ్యం కాదు. కానీ వ‌ర్చువ‌ల్ గోల్డ్‌ను ఎంత త‌క్కువ మొత్తంతో అయినా కొన‌వ‌చ్చు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు గోల్డ్‌ను వ‌ర్చువ‌ల్‌గా కొంటూ బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. త‌రువాత అవ‌సరం అనుకుంటే దాన్ని అమ్ముకోవ‌చ్చు.

now you can buy gold in amazon pay as little as for rs 5

అమెజాన్ పేలో వచ్చిన ‘గోల్డ్‌వాల్ట్’ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు కేవ‌లం రూ.5తో గోల్డ్ కొని అందులో పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. దీర్ఘ‌కాలంలో ఇలా చిన్న మొత్తాల్లో గోల్డ్‌ను కొంటూ పోతే ఒకేసారి పెద్ద మొత్తంలో గోల్డ్ జ‌మ అవుతుంది. దాన్ని అవ‌స‌రం అనుకుంటే మ‌ళ్లీ అమ్మ‌వ‌చ్చు. లేదా పెట్టుబ‌డులు కంటిన్యూ చేయ‌వ‌చ్చు. ఇక పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్‌ల‌లో ఇప్ప‌టికే డిజిట‌ల్ రూపంలో గోల్డ్‌ను కొనే సౌక‌ర్యం అందిస్తున్నారు. ఆయా మాధ్య‌మాల్లో కేవ‌లం రూ. 1కే వ‌ర్చువ‌ల్ రూపంలో గోల్డ్‌ను కొనే వెసులు బాటు అందించారు. కాగా అమెజాన్ పేలో రూ.5తో గోల్డ్ కొన‌డం ప్రారంభించ‌వ‌చ్చు.

ఇలా కొనే గోల్డ్ 99.5 శాతం స్వ‌చ్ఛంగా ఉంటుందని, అది 24 క్యారెట్ గోల్డ్ అని అమెజాన్ పే తెలిపింది. భౌతిక రూపంలో పెద్ద మొత్తంలో ఒకేసారి బంగారం కొన‌లేని వారు ఇలా చిన్న మొత్తాల్లో డిజిట‌ల్ రూపంలో గోల్డ్ కొని దాచుకోవ‌చ్చ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news