బొజ్జగణపయ్యకు అ్యతంత ఇష్టమైనవి ఉండ్రాళ్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఉండ్రాళ్లను ఆహా ఓహో అంటూ తినేస్తుంటాం.. మరి ఎంతమందికి ఉండ్రాళ్లు చెయ్యటానికి వచ్చు..? మరి నేర్చుకుందామా?
కావలసిన పదార్థాలు :
బియ్యం రవ్వ – అర కప్పు
శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్
నెయ్యి – ఒక టీ స్పూన్
ఉప్పు – పావు టీ స్పూన్
తయారు చేసే విధానం :
శనగపప్పులో కొన్ని నీళ్ళు పోసి అరగంటపాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఎండబెట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి శనగపప్పును వేయించాలి. దీంట్లో ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్లు మరిగాక ఉప్పు, బియ్యం రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి దించేయాలి. చల్లారాక చిన్న, చిన్న ఉండలు చేసుకోవాలి. వీటిని మళ్లీ స్టీమర్‌లో పెట్టి పావుగంటపాటు ఆవిరి మీద ఉడికించాలి. వినాయకుడు మెచ్చే ఉండ్రాళ్ళు నివేదించడానికి రెడీ!