ప్రముఖ ఆలయంలో గణేశుడి విగ్రహం చోరీ… విగ్రహం ప్రాముఖ్యత తెలుసా..?

-

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలోని ప్రముఖ సోమేశ్వర ఆలయంలోని పురాతన వినాయక రాతి విగ్రహం చోరీకి గురైంది. సినీ ఫక్కీలో పట్టపగలు చోరీ చేశారు దుండగులు.సోమేశ్వర ఆలయానికి శనివారం ఉదయం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్లారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కాసేపటి తరువాత ఆలయంలో కుడి వైపున ప్రతిష్ఠించి ఉన్న వినాయక రాతి విగ్రహం మాయమైనట్లు పూజారులు గుర్తించారు.

ganesh
ganesh

ఆ ముగ్గురు కనిపించకపోయేసరికి వారే చోరీ చేసినట్లు అర్చకులు గ్రహించి సమాచారాన్ని ఆలయ ధర్మకర్త విజయకుమార్​కు తెలియజేశారు. ఆయన సోమశిల పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఎస్​ఐ సుబ్బారావు ఆలయాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. చోరీకి గురైన విగ్రహం చోళుల కాలం నాటిది కావటంతో… రాతి విగ్రహంలో విలువైన వజ్రాలు దాచి ఉంటారన్న అభిప్రాయంతోనే చోరీ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినాయకచవితి రోజు ఈ ఘటన జరగటం భక్తులకు తీరని ఆవేదన మిగిల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news