తండ్రి నుండి ప్రాణహాని.. పోలీసుల వద్దకు నటి..!

-

బాలీవుడ్ సీరియల్ నటి తృప్తి శంఖధార్ (19) తన తండ్రి నుండి తనకు ప్రాణహాని ఉందని బరేలి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు తన తల్లితో కలిసి తనను రక్షించాలంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన తండ్రి తనకు ఇష్టం లేని అబ్బాయితో పెళ్లి చేయాలనీ చూస్తున్నాడని, పెళ్ళికి నిరాకరించడంతో దాడి చేసాడని తృప్తి వెల్లడించింది. తన తండ్రి రామ్ రతన్ శంఖధార్‌తో తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. అలాగే పోలీసులు నా ఫిర్యాదును స్వీకరించడం లేదు. దయచేసి నాకు రక్షణ కల్పించండని ఆమె ఆ వీడియోలో పేర్కొంది.

View this post on Instagram

#uppolice #yogi #spcity #bareilly #delhi

A post shared by Tripti Shankhdhar (@triptishankhdhar) on

అయితే ఈ ఘటనలో తమకు ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదని, సోషల్ మీడియాలో నటి పోస్ట్ గురించి తెలుసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని బరేలీ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇకపోతే తృప్తి శంఖధార్ ప్రస్తుతం టిక్ టాక్ స్టార్  కిరణ్  హీరోగా తెరకెక్కుతున్న “ఓయ్  ఇడియట్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news