అనిల్ అంబానీకి హైకోర్టులో ఊరట..!

-

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన దివాలా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం నిలిపివేసింది. రూ. 1200 కోట్ల రుణం విషయంలో ఎస్బీఐ చేపట్టనున్న దివాలా చర్యలను హైకోర్టు అడ్డుకుంది. అలాగే ఆస్తులను విక్రయించకుండా అనిల్ అంబానీని నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే రిలయన్స్ సంస్థలు తీసుకున్న రుణాలు మొండి బకాయిలుగా మారటంతో దివాలా చట్టం ప్రకారం అంబానీ నుంచి రాబట్టేందుకు ఎస్బీఐ రంగంలోకి దిగింది.

అయితే అనిల్ అంబానీ 2002లో మొబైల్ సేవల్ సంస్థ ఆర్‌కామ్ ను ప్రారంభించారు. కానీ, అదికాస్తా భారీగా అప్పుల్లో కూరుకుపోయింది. ఆఖరికి 2016లో ముకేశ్ అంబానీ స్టార్ట్ చేసిన జియో ఎఫెక్ట్ మీద దీనిమీద గట్టిగానే పడింది.

Read more RELATED
Recommended to you

Latest news