తెలంగాణలో ఇక అలాంటి వాటికి అనుమతులు ఉండవు..

-

అనుమతులని అతిక్రమించి ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. అనుమతులు తీసుకున్నాక వాటికి అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేసుకోవడంపై సీరియస్ అయ్యింది. రెండంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని మూడు, నాలుగు… ఇలా రిజిస్ట్రేషన్లో ఒకటి, నిర్మించేదొకటి తరహా వాటిపై కఠినంగా వ్యవహరించనుంది.

తాజాగా ఈ విషయమై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఎంతవరకు అనుమతులు ఇచ్చారో అంతవరకే, అంతకుమించి కొంచెం కూడా అతిక్రమించినా వాటికి రిజిస్ట్రేషన్ చేయబోవడం లేదట. అనధికార నిర్మాణాలని క్షమించబోమని స్పష్టం చేసింది. ఈ విషయమై కీలక విధి విధానాలను రూపొందించిందట. ఇకపై అక్రమంగా ఎలాంటివి కనిపించిన నిర్ద్యాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటారట.

అటువంటి నిర్మాణాలకి రిజిస్ట్రేషన్ చేయబోమని, కఠినంగా ఉంటామని పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకి, సబ్ రిజిస్ట్రార్లకి ఆదేశాలు పంపబడ్డాయట. అందువల్ల ఇకపై అక్రమ నిర్మాణలు ఉండవని తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news