కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలు అయ్యాయి. ఇలాంటి సమయంలో సినిమా, టీవీ షూట్స్ కి తాజాగా పర్మిషన్స్ ఇచ్చినా, ఇంకా పూర్తి స్థాయిలో అవి మొదలు కాలేదు. ఈ తరుణంలో బిగ్ బాస్ నిర్వహణ మీద కూడా సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చేసినా తమిళ్ విషయంలో మాత్రం ఇన్నాళ్ళూ సస్పెన్స్ కొనసాగింది.
ఇప్పటి దాకా అనౌన్స్ చేయకపోవడంతో అసలు ఉండకపోవచ్చని భావించినా అది నిజం కాదని వచ్చేస్తున్నానని చెబుతూ ప్రోమో రిలీజ్ చేశారు కమల్ హాసన్. ఈ సాయంత్రమే బిగ్ బాస్ ని టెలీకాస్ట్ చేసే విజయ్ టీవీ కొంత క్లారిటీ ఇచ్చినా, ఇప్పుడు పూర్తి క్లారిటీ ఇచ్చాడు కమల్. ఈ ప్రోమోలో కరోనా ప్రపంచాన్ని ఎలా స్థంబించబడేలా చేసిందో చెప్పిన ఆయన ఇప్పుడు మళ్ళీ రొటీన్ పనుల్లో పడే టైం వచ్చిందని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్ లో కంటెస్ట్ఎంట్ లు ఎవరనేదాని మీద క్లారిటీ లేదు.
நாமே தீர்வு pic.twitter.com/sUQDiEOpmo
— Kamal Haasan (@ikamalhaasan) August 27, 2020