కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (27-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో గురు‌వారం (27-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 27th august 2020

1. దేశంలో కొత్త‌గా 75,760 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 33,10,235కు చేరుకుంది. 7,25,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 25,23,772 మంది కోలుకున్నారు. 60,472 మంది చ‌నిపోయారు.

2. ఏపీలో కొత్త‌గా 10,621 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 94,209 మంది చికిత్స పొందుతున్నారు. 2,92,353 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,90,195కు చేరుకుంది. 3,633 మంది చ‌నిపోయారు.

3. తెలంగాణ‌లో కొత్త‌గా 2,795 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,14,483కు చేరుకుంది. 26,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 86,095 మంది కోలుకున్నారు. 788 మంది చ‌నిపోయారు.

4. కరోనా బారిన ప‌డి కోలుకుంటున్న వారి జాబితాలో దేశంలో ఢిల్లీ మొద‌టి స్థానంలో ఉండ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో ఉంది. ఢిల్లీలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 90 శాతంగా, త‌మిళ‌నాడులో 85 శాతంగా ఉంది. ఆ త‌రువాత 83.80 రిక‌వ‌రీ రేటుతో బీహార్ మూడో స్థానంలో నిలిచింది.

5. క‌రోనా వ్యాక్సిన్‌ను అన్ని దేశాలు స‌క్ర‌మంగా త‌మ ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయ‌డం పెద్ద స‌వాల్‌తో కూడుకున్న ప‌ని అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టు సౌమ్య స్వామినాథ‌న్ అన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే ముందుగా అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించే వారికి పంపిణీ చేయాల‌న్నారు.

6. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,981 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,03,242 కు చేరుకుంది. 3,43,930 మంది కోలుకున్నారు. 53,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,948 మంది చ‌నిపోయారు.

7. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇద్ద‌రు వాలంటీర్ల‌కు ఇచ్చామ‌ని సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రి ప‌రిస్థితి బాగ‌నే ఉంద‌ని తెలిపింది. మ‌రో వారంలో 25 మందికి టీకాను ఇస్తామ‌ని తెలియ‌జేసింది.

8. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 14,718 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,33,568కి చేరుకుంది. 5,31,563 మంది కోలుకున్నారు. 1,78,234 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 23,444 మంది చ‌నిపోయారు.

9. క‌రోనా టెస్టుల నేప‌థ్యంలో అమెరికా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ ఉన్న‌వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి ల‌క్ష‌ణాలు లేక‌పోతే క‌రోనా టెస్టులు చేయబోమ‌ని తెలిపింది. వారికి టెస్టులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది.

10. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న నీట్‌, జేఈఈ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌వ‌ద్ద‌ని కోరుతూ 150 మంది అధ్యాప‌కులు ప్ర‌ధాని మోదీకి లేఖ రాశారు. ప‌రీక్ష‌ల‌ను ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల విద్యార్థుల‌ భ‌విష్య‌త్తు దెబ్బ తింటుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news