గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆర్మీ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ముఖర్జీకి ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందుతోందని వైద్యులు తెలిపారు. ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.
ప్రణబ్ ముఖర్జీని ఇప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచే చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన కోమాలోనే ఉన్నారని వివరించింది. కాగా, మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ప్రణబ్ ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరగా కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అదే రోజు ఆయనకు మెదడు శస్త్రచికిత్స కూడా జరిగింది. ఇక ఆరోజు నుంచి ఆయన వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు.