గాంధీ నుండి పరారయిన ఖైదీల పిక్స్ రిలీజ్.. పట్టిస్తే రివార్డ్ !

-

గాంధీ నుంచి పరారైన కోవిడ్ పాజిటివ్ ఖైదీల కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గాంధీ నుంచి తప్పించుకున్న వారిని అబ్దుల్ అర్బాజ్, జావీద్, సోమ సుందర్, నరసయ్యలుగా గుర్తించారు. గాంధీ ఆసుపత్రి రెండో అంతస్తులో 20 మంది కోవిడ్ పాజిటివ్ ఖైదీలు చికిత్స పొందుతున్నారు. నిన్న తెల్లవారుఝామున 3 గంటలకు వార్డులోనే అందరు ఖైదీలు ఉన్నారు. కానీ ఉదయం 6 గంటలకు నలుగురు మిస్సయినట్టు వార్డులో విధులు నిర్వహిస్తోన్న ముగ్గురు కానిస్టేబుళ్లు గుర్తించారు.

వీరిలో నరసయ్య 2011లో ఒకసారి కస్టడీ నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి బెడ్ షీట్లను తాడులా పేని వీరు కిందకు దిగినట్టు గుర్తించారు. సీసీ టీవీలు పని చేయకపోవడంతో దృశ్యాలు ఏవీ రికార్డ్ కాలేదు. నిందితుల పట్టుకోవడం కోసం రెండు బృందాలతో గాలిస్తున్న పోలీసులు వారి ఫోటోలు విడుదల చేశారు. నేరస్థుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డ్ ప్రకటించారు పోలీసులు. నిందితుల నలుగురికి కోవిడ్ పాజిటివ్ ఉంది. నిందితులు నలుగురు సాధారణ దుస్తుల్లోనే బయటికి వెళ్ళారని, నిందితుల ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news