టీడీపీకి ప్రతిపక్ష హోదా.. వైజాగ్ పెట్టిన భిక్ష.. అవంతి శ్రీనివాస్..

0
281

ఆంధ్రపదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి నుండి రాజథానిని వైజాగ్ మారుస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సహా ఇతర పార్టీలు తమ వ్యతిరేకతని తెలియజేస్తున్నాయి. తెలుగుదేశం ఒక అడుగు ముందుకేసి వైయస్సార్సీపీ ఎమ్మేల్యేలని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.

రాజధాని తరలింపుకి వ్యతిరేకంగా రాజధాని నియోజక వర్గ ఎమ్మేల్యేలని రాజీనామా చేయాలని పట్టుబడుతుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రంగంలోకి దిగారు. వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తుండడాన్ని ఆపుతున్నందున్న టీడీపీ ఎమ్మేల్యేలు రాజీనామా చేయాలని కోరాడు. వైజాగ్ ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తమ ప్రాంతం పట్ల అభిమానాన్ని చాటుకోవాలని కోరాడు.

వైజాగ్ వాసుల వల్లే టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కిందని, లేకపోతే ఆ అధికారం ఉండేది కాదని, అందువల్ల వైజాగ్ వాసుల పట్ల కృతజ్ఞతగా ఉండాల్సిందని, వైజాగ్ వాసుల వల్లే ప్రతిపక్ష హోదా దక్కిందన్న విషయం మర్చిపోరాదని అన్నాడు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ముఖ్యమంత్రి చేస్తున్న పనులని అడ్డుకోవడం సమంజసం కాదని, బాధ్యాతయుతమైన రాజకీయ పార్టీలు అలాంటి వాటికి పూనుకోవని, ఇకనైనా అలాంటివి మానుకోవాలని తెలియజేసారు.