ఈ సారి మన్‌కీ బాత్‌ లో గేమ్స్ గురుంచి చెప్పిన మోదీ..!

-

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన ఆన్‌లైన్ గేమింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేయాలని దేశ యువతకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్‌ లోకల్‌లో భాగంగా దేశీయంగా బొమ్మలు తయారీ చేసేందుకు ముందుకు రావాలని స్టార్టప్‌ కంపెనీలు, యువతను కోరారు. బొమ్మల పరిశ్రమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు మోదీ. ఈ రంగంలో భారత్ వాటా చాలా తక్కువగా ఉందన్నారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పలు కీలక విషయాలపై మాట్లాడారు.

అన్నదాతలను గౌరవించే సంస్కృతి మనది. మన వేదాల్లో రైతులను ప్రశంసించే శ్లోకాలుఉన్నాయి. కరోనా వేళ కూడ మన రైతులు కష్టపడి సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో గతేడాది కంటే ఎక్కువ సాగు చేశారు. ప్రతి పండుగనూ పర్యావరణహితంగా చేసుకోవాలి. ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకుని పండుగలు చేసుకుంటున్నారు. ఓనం పండుగ ఉత్సాహం ఇవాళ ప్రపంచ నలుమూలలకూ చేరింది. అంతర్జాతీయ ఉత్సవంగా మారుతోంది అని ప్రధాని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news