అమెరికాలో భార‌తీయుల ఆదాయ‌మే టాప్‌!

-

అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌తీయులు స‌త్తాచాటుతున్నారు. ఆదాయ ఆర్జ‌న‌లో అంద‌రికంటే ముందువ‌రుస‌లో నిలుస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉన్న‌ట్లు తాజా స‌ర్వేలో తేలింది. ఇది వివిధ రంగాల్లో మనోళ్లకున్న ప్రతిభాపాటవాలకు నిదర్శనమ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఏటా అక్కడి ప్రభుత్వం అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే చేప‌డుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్న స్థానికులు, విదేశీయుల మధ్యస్థ కుటుంబాల ఆదాయ వివరాలు నమోదు చేసి వెల్ల‌డిస్తుంది. అందులో వివిధ దేశాల నుంచి వచ్చినవారి గణాంకాలూ పొందురుస్తారు.

దీని ప్ర‌కారం.. అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్ల‌ ఆదాయం ఏటా అందరికంటే 1,00,500 డాలర్లుగా నమోదైంది. ఇక భార‌త్ దేశాలైన శ్రీలంక నాలుగు, చైనా ఏడు, పాకిస్తాన్‌ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. అయితే.. స్థానికులు ఏకంగా 9వ స్థానంలో నిలవడం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అమెరికాలో స్థిరపడుతున్న విదేశీయుల్లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ ఉన్న వారిలోనూ ఇండియన్లే నంబర్‌వన్. ఈ విషయంలో అమెరికన్లు 28 శాతంతో ఆఖరిస్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news