మిస్‌ నాటా 2020 రన్నరప్‌గా తారిక

-

మిస్‌ నాటా 2020 ప్రథమ రన్నరప్‌గా ప్రవాస భారతీయురాలు తారిక యెల్లౌలా నిలిచారు. అమెరికాలోని నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌(నాటా) ప్రతిభావంతులను, కొత్త వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ క్రమంలో నాటా ప్రపంచ స్థాయి మిస్‌ నాటా పోటీలను నిర్వహించింది. ప్రత్యేకంగా తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో నివాసముంటున్న పదహారేళ్ల తారిక యెల్లౌలా పాల్గొంది. మిస్‌ నాటా 2020 రన్నరప్‌గా నిలిచిన ఆమె తన చదువును కొనసాగిస్తూనే నటనను, నృత్యాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

తన తల్లిదండ్రులు వెంకట్, రోజా, గురువు మాళిని అయ్యర్‌ ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్లు తారిక యెల్లౌలా పేర్కొంటున్నారు. చిన్నప్పటి నుంచే నాట్యం, అభినయం వంటి కళల్లో శిక్షణ తీసుకుంటూ తన సోదరి తాన్వికతో కలిసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news