భారతదేశ మొట్టమొదటి మహిళా కార్డియాలజిస్ట్, డాక్టర్ ఎస్ ఐ పద్మావతి కరోనాతో కన్నుమూశారు. ఆమె వయసు 103 సంవత్సరాలు. 11 రోజుల క్రితం ఆమె కరోనాతో బాధ పడుతూ తన సొంత ఆసుపత్రి నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌హెచ్‌ఐ) లో చేరారు. ఇక ఆమె గురించి ఆసుపత్రి సిఇఒ డాక్టర్ ఓపి యాదవ్ మాట్లాడుతూ, డాక్టర్ పద్మావతి రెండు ఊపిరితిత్తులలోనూ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఏర్పడిందని, ఆమె మరణానికి ఇదే మరణానికి కారణమైందని చెప్పారు.
ఆమె అంత్యక్రియలు నిన్న పశ్చిమ డిల్లీలోని పంజాబీ బాగ్ శ్మశానవాటికలో జరిగాయి. ఈమె 103 ఏళ్ళ వయసులో కూడా గత కొన్ని రోజుల వరకూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారు. 2015 చివరి వరకు, ఆమె 1981లో స్థాపించిన ఎన్‌హెచ్‌ఐలో రోజుకు 12 గంటలు పాటు వారానికి ఐదు రోజులు పనిచేసేది. అంత మొండిది ఆమె. అలాంటి ఆమెను కరోనా కాటు వేయడం బాధాకరమే.