సోషల్ మీడియా లో మెగా హీరోలు చేసే సందడి అంతా.. ఇంతా కాదు. ముఖ్యంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అయితే మరీ యాక్టివ్. నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటూ.. తనకు సంబంధించిన సమాచారాన్ని అభిమనులతో పంచుకుంటుంటాడు ఈ మెగా హీరో. అయితే తాజాగా ఈ మెగా ప్రిన్స్ ఒక ఫోటోని షేర్ చేశాడు. ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారిపోయింది. తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ,ఓ ఫోటోను పోస్టు చేసి, ‘నీ హెయిర్ స్టయిల్ అంటే నాకు బాగా ఇష్టం సాయితేజ్’ అంటూ వరుణ్ ట్వీట్ చేశారు.
దీనికి సాయితేజ్ బదులిస్తూ, ‘నీ గడ్డం స్టయిల్ నాకు బాగా నచ్చుతుంది వరుణ్ ‘ అంటూ రీట్వీట్ చేశారు. ఇలా మొత్తానికి మెగా హీరోలు ఇండస్ట్రీకి రాకముందు ఎలా ఉండేవారు చెబుతూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. వీరిద్దరి ట్వీట్లను మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
Love your hairstyle @IamSaiDharamTej 🤣🤣🤣#chilhoodmemories pic.twitter.com/BnX4COqeNA
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) September 1, 2020
Love your beard style @IAmVarunTej 😋🤣🤣 #vintagebeard https://t.co/pft9EYK8eO pic.twitter.com/K31DYpPlgY
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2020