ఐఫోన్ల అమ్మకాలు పెరిగాయా… లెక్కలు ఏం చెబుతున్నాయి..

-

ప్రపంచంలో పేరున్న మొబైల్ కంపెనీగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆపిల్ తన వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునే పనిలో ఉంది. చైనాలో అతిపెద్ద తయారీ యూనిట్ ఉన్న ఈ సంస్థ, ఎక్కువభాగం అక్కడి నుండే మొబైల్ ఫోన్లని ఉత్పత్తి చేస్తుంది.ఇండియాలో ఆపిల్ తన సొంత రిటైలర్ ని ప్రారంభించాలని చూస్తుంది. ఇప్పటివరకు థార్డ్ పార్టీ రిటైలర్లపై ఆధారపడి ఉంది. ఐతే కరోనా కారణంగా అన్ని వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టాలని చవిచూసాయి. ఆపిల్ సంస్థకి కూడా నష్టాలు వస్తాయని భావించారట. కానీ అనూహ్యంగా ఆపిల్ సంస్థ ఆర్థికంగా పెరుగుదలని సూచించింది.

కోవిడ్ విజృంభణ వల్ల ఉద్యోగులందరూ ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేయడం వల్ల ఆపిల్ ప్రొడక్ట్స్ కి డిమాండ్ విపరీతంగా పెరిగిందట. ఐఫోన్లు, మ్యాక్ బుక్స్, ఇలా ఆపిల్ ప్రొడక్ట్స్ బాగా సేల్ అయ్యాయట. దీన్నిబట్టి ఆపిల్ తన అమ్మకాలని విపరీతంగా పెంచుకుందని తెలుస్తుంది. అదీగాక తాజాగా ఆపిల్ తన సప్లైదారుల నుండి 75మిలియన్ల ఐఫోన్ల తయారీని కోరింది.

 

ఐఫోన్ 5జీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐఫోన్ 12. ఐఫోన్ 11 తర్వాత మరిన్ని కొత్త కాన్ఫిగరేషన్స్ తో సరికొత్తగా రానుంది. 5జీ కనెక్టివిటీతో వస్తున్న ఈ ఐఫోన్ ధర ఐఫోన్ 11కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంత రేట్ అఫార్డ్ చేయడం కష్టమే. సో ఐఫోన్ 12 లాంచింగ్ 2021లో ఉండే అవకాశం ఉంది.

ఏదైతేనేం ఆపిల్ మార్కెట్ ప్రస్తుతం ఆశాజనకంగా ఉంది. మరిన్ని రోజుల్లో ఆ వృద్ధి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 75మిలియన్ల ఐఫోన్ల అమ్మకం అంటే నిజంగా పెద్ద టార్గెటే. మరి ఆ టార్గెట్ ని ఆపిల్ చేరుకుంటుందా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news