ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపిలో రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. గతంలో టీడీపీ హయాంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేస్తే కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అని ఆవేదన వ్యక్తం చేసారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించారు అని ఆరోపించారు .వ్యవసాయ మోటర్లకు స్మార్టు మీటర్లు పెట్టాలని కేంద్ర ఆదేశించింది అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు…వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం అన్నారు. రైతులు బిల్లులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి బాలినేని స్పష్టం చేసారు.