రియా చక్రవర్తికి అండగా స్టార్ హీరోయిన్…!

-

సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య విషయంలో అందరూ రియా చక్రవర్తిని దోషిగా చూస్తున్న సమయంలో రియాకు అండగా నిలిచింది బాలీవుడ్ స్టార్ నటి విద్యా బాలన్. తాప్సీ పన్నూ, స్వరా భాస్కర్, కుబ్రా సైట్, లక్ష్మి మంచు, చిత్రనిర్మాత అనుభావ్ సిన్హా వంటి నటులు గతంలో రియాకు అనుకూలంగా మాట్లాడారు. మీడియా చేస్తున్న అతిని తీవ్రంగా తప్పుబట్టారు కూడా.

Vidya Balan shares her casting couch experience

ఇప్పుడు విద్యా బాలన్ ఆమెకు అండగా వచ్చింది. రియాకు వ్యతిరేకంగా మీడియా కవరేజీని నిందిస్తూ లక్ష్మీ మంచు చేసిన ట్వీట్ కు స్పందిస్తూ విద్యా, “రియా చక్రవర్తిని దుర్భాషలాడటం పట్ల నా గుండె పగిలిపోతుంది” అని అన్నారు. “దోషిగా నిరూపించబడే వరకు అమాయకురాలిగా భావించలేదా?” అంటూ ఆమె మీడియాను ప్రశ్నించారు. విద్యా తన సోషల్ మీడియా హ్యాండిల్‌ పై మరో కామెంట్ చేసింది. “ఈ విషయం బిగ్గరగా చెప్పినందుకు దేవుడు లక్ష్మి మంచును ఆశీర్వదిస్తాడు” అని విద్య చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news