క్యాన్సర్‌ను కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందుకోసం ముందస్తు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆదివారం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రన్నింగ్‌లో గెలిచిన వారికి మెడల్స్, చెక్కులను అందించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘రన్నింగ్ ఫర్ గ్రేస్, స్క్రీనింగ్ ఫర్ లైఫ్’-అనే థీమ్‌తో క్యాన్సర్‌పై పోరాటంలో ముందస్తుగా ఎలా గుర్తించాలనే ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం వలన ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా చూడొచ్చని..ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులను అందించడమే కాకుండా.. క్యాన్సర్ వ్యాధి కట్టడికి అనేక చర్యలు తీసుకున్నదన్నారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే తగ్గించవచ్చని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నా ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే వ్యాధి ముదిరి ప్రాణాలు పోతున్నాయన్నారు.