ముంబై వస్తున్నా.. దమ్ముంటే ఆపండి: కంగనా సవాల్

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఈ కేసు విషయమై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కంగనా ప్రశ్నిస్తుంది. పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తుంది. ఈ క్రమంలో కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ ట్వీట్లు కూడా చేస్తునారు. అలాగే శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ కూడా కంగానపై మండిపడ్డారు. అసలు నీవు ముంబైలో ఎలా అడుగుపెడుతావో చూస్తాను? అంటూ బహిరంగ వార్నింగ్ ఇచ్చారు.

Kangana

వీటిపై తాజాగా.. కంగనా రనౌత్ స్పందించారు. తనకు ముంబయిలో ఉండే హక్కులేదని, వస్తే చచ్చేదాకా కొడతామని హెచ్చరిస్తున్నారని వివరించారు. కానీ తాను ముంబై రావాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. సెప్టెంబరు 9న ముంబైలో అడుగుపెడుతున్నానని, ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే టైమ్ కూడా చెబుతానని, దమ్మున్నవాళ్లెవరో తనను ఆపుకోవచ్చని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news