80 రైళ్ళని సిద్ధం చేస్తున్న రైల్వే శాఖ.. సెప్టెంబర్ 12 నుండే..

-

కరోనా కారణంగా రైల్వే సర్వీసులు దాదాపుగా నిలిపివేయబడ్డాయి. మార్చ్ 25వ తేదీ న రైల్వే సర్వీసులని నిలిపివేసిన కేంద్రం వలస కార్మికుల కోసం ప్రత్యేక రైళ్ళు వేయడంతో మళ్లీ పట్టాలనెక్కించింది. ఆ తర్వాత అన్ లాక్ దశలో భాగంగా కొన్ని స్పెషల్ మార్గాల్లోనే రైళ్ళు నడిచాయి. అయితే ప్రస్తుతం అన్ లాక్ 4లో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నడుస్తున్న 230 రైళ్లకి మరో 80రైళ్ళని జోడిస్తూ పట్టాలనెక్కించడానికి సిద్ధం అవుతోంది.

ఈ మేరకు రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ యాదవ్ అధికారిక ప్రకటన చేసారు. సెప్టెంబరు 12వ తేదీ నుండి ఈ రైళ్ళు నడపబడతాయి. అంటే సెప్టెంబర్ 10వ తేదీ నుండి రిజర్వేషన్స్ స్టార్ట్ అవుతాయట. వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎక్కడైతే ఏ రైల్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుందో. ఎక్కడైతే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ క్లోన్ టైన్ ని నడుపుతారట. దాంతో ప్రయాణికులు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటారని అంటున్నారు.

ఆ 80 రైళ్ళు ఏ మార్గాల గుండా ప్రయాణించనున్నాయో ఇక్కడ తెలుసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news