బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న ఆయన వైద్యుల సలహా మేరకు నేను హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నానని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
తాను కరోనా బారిన పడ్డానని మీ దృష్టికి తేవడం తన కర్తవ్యం అని ఆయన పేర్కొన్నాడు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో కూడా తన ఆరోగ్యం గురించిన అప్డేట్స్ అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే అర్జున్ కపూర్ చివరిసారిగా 2019 లో చారిత్రక ‘పానిపట్’ మూవీలో కనిపించారు. ఇక ప్రస్తుతం భూత్ పోలీస్ అనే హర్రర్-కామెడీ సినిమాలో లేదా రోల్ చేస్తున్నాడు.