తెలంగాణా అసెంబ్లీ వద్ద 144 సెక్షన్.. 650 మంది పోలీసులతో భద్రత !

-

రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 20 రోజుల పాటు జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకి ఆరు వందల యాభై మంది పోలీసులతో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ భద్రతా ఏర్పాట్లని చేశారు. భద్రతా పర్యవేక్షణ ఇన్-ఛార్జ్ అధికారిగా జాయింట్ పోలీసు కమిషనర్ సెంట్రల్ జోన్ విశ్వ ప్రసాద్ ని నియమించారు. ఇక అసెంబ్లీ సమావేశాలతో పాటు శాసన మండలి పరిసర ప్రాంతాల్లో మూడంచెల పోలీసుల భద్రతని ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ సమావేశాలకు విధులు నిర్వహించే 650 మంది పోలీసులకు కర్రోనా టెస్ట్ లు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్ పంపి చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఇక ఈ 650 మంది పోలీసులతో పాటు అదనంగా మఫ్టి, ఐడి, ఎస్బి, ఇంటలిజెన్స్, సిటీ కమాండో, సిటీ ఆర్మ్ రిజర్వ్ ఫోర్స్, సిటీ క్విక్ యాక్షన్ ఫోర్స్ తో పాటు తెలంగాణ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ట్రాఫిక్, సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ బృందాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలానే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news