రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. ముందుగా అసెంబ్లీ మొదలు కాగానే సిట్టింగ్ ఎమ్మెల్యే దుబ్బాక రామలింగారెడ్డి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఈ సంతాప తీర్మానం తర్వాత BAC సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ BAC సమావేశంలోనే అసెంబ్లీ, మండలి వాటి అజెండా, పని దినాలను ఖరారు చేయనున్నారు. అయితే మామూలుగా ఈ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఎల్లుండి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల సందర్బంగా చర్చ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. సంతాప తీర్మాణం ఉన్న నేపథ్యంలో ప్రశ్నోత్తరాల సెషన్ ని స్పీకర్ రద్దు చేసినట్టు సమాచారం. ఇక రేపు సాయంత్రం 5 గంటలకు టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట్ రామలింగ రెడ్డికి సంతాపంతో పాటు అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరగనుంది.