కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆద్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడికి యత్నం చేసారు. ఈ ఆందోళనలో ములుగు ఎమ్మెల్యే సితక్క పాల్గొన్నారు. అలాగే కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం 500 కోట్లు చెల్లింపు, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసారు.
పోలీసులకు సితక్క కి మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తిరుపై సితక్క ఆగ్రహం వ్యక్తం చేసారు. ముట్టడికి యత్నించిన ఎమ్మెల్యే సితక్క తో పాటు కిసాన్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అయ్యారు. సితక్క మాట్లాడుతూ… నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. అసెంబ్లీ లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని ఆమె ఆరోపించారు. రైతుల డిమాండ్ల పై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.