ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలకి షాకిచ్చిన దుబాయ్ ఎయిర్ పోర్ట్..

-

అంతర్జాతీయ ప్రయాణాలకి ఇప్పుడిప్పుడే అనుమతులు లభిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా విమానాలు గాల్లో ఎగురుతున్నాయి. కోవిడ్ కారణంగా పకడ్బందీ జాగ్రత్తల నడుమ విమానాలని నడుపుతున్నారు. ఐతే తాజాగా దుబాయ్ ఎయిర్ పోర్ట్, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలకి షాకిచ్చింది. కరోనా పాజిటివ్ గా వచ్చిన వారిని దుబాయ్ చేరవేసిందంటూ, దాని వల్ల ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలని పదిహేను రోజుల పాటు సస్పెండ్ చేసింది. ఈ మేరకు దుబాయ్ ఎయిర్ పోర్ట్ తన నిర్ణయాని ఈరోజే తెలియజేసింది.

సెప్టెంబర్ 18వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలని దుబాయ్ లో అడుగుపెట్టనివ్వకుండా చేసింది. గత రెండు వారాల్లో కరోనా పాజిటివ్ కేసులని దుబాయ్ కి తీసుకువచ్చిందని దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఆరోపిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణం చేసేటపుడు కరోనా టెస్ట్ తప్పనిసరి అని తెలియజేస్తూ, నెగెటివ్ గా నిర్ధారణ అయితేనే ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని, నెగెటివ్ సర్టిఫికెట్ ని ప్రయాణీకులు తమ దగ్గర ఉంచుకోవాలని కోరింది. నెగెటివ్ వచ్చిన నాలుగు రోజుల తర్వాతే ప్రయాణానికి అనుమతించాలని అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news