సంక్షోభం సమయంలో కూడా సంక్షేమం దిశగా అడుగులు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పేదలకు చేయూతనిచ్చే విధంగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నిరుపేదల అందరూ ప్రభుత్వాసుపత్రులకు వచ్చి వైద్యం చేయించుకునేందుకు ఏకంగా ప్రోత్సాహకాలను కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే . ఇక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే రాష్ట్ర ప్రజలందరికీ చేయూతనిచ్చే విధంగా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
ఇక ఈ పథకం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ప్రజలందరికీ శుభవార్త వినిపించింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని పెంచుతూ ప్రకటన విడుదల చేసింది ఏపీ సర్కార్. ప్రస్తుతం మహిళలకు సాధారణ ప్రసవానికి సిజేరియన్ కు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుని శుభవార్త తెలిపింది. సాధారణ ప్రసవానికి 3000 ఉన్న ప్రోత్సాహకాన్ని ఐదు వేలకు పెంచింది అంతేకాకుండా సిజేరియన్ కి ప్రోత్సాహకాన్ని వెయ్యి రూపాయల నుంచి మూడు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.