చైనా తిక్క కుదిర్చిన అమెరికా…! అచ్చం భారత్ లాగే!

-

అమెరికా-చైనా దేశాల మధ్య ప్రస్తుతం విపరీతమైన టెన్షన్ నెలకొంది. ఇక టెక్నాలజీ విషయంలో ఎవరికి ఎవరూ తీసిపోరు. చైనీయులు మాత్రం మరీ ఘోరంగా అవతల దేశం భద్రతను, గోప్యతను తస్కరించి విధంగా వారి అప్లికేషన్లు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల భారతదేశం కొన్ని వందల చైనా యాప్స్ ను బ్యాన్ చేసింది కూడా. ఇక బ్యాన్ చేయాల్సిన లిస్టులో మరికొన్ని వందలాది అప్లికేషన్స్ ఉన్నాయంటూ దేశ సమాచార సంస్థ నుండి వార్తలు కూడా బయటకు వచ్చాయి.

అయితే ఇదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ అధికారులు కూడా ఈరోజు నుండి చైనా దేశానికి చెందిన టిక్ టాక్, వి చాట్ వంటి యాప్స్ ను డౌన్లోడ్ చేసుకోవడం పై బ్యాన్ విధించారు. ఇక ఇక వచ్చే వారం నుండి అమెరికాలో ఈ రెండు అప్లికేషన్స్ పనిచేయవు. ఇవి దేశ జాతీయ భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

కామర్స్ సెక్రటరీ విల్బర్ రాస్ మాట్లాడుతూ… చైనాలోని కమ్యూనిస్టు పార్టీ వారు తమ ఉద్దేశాలను భావాలను చాలా స్పష్టంగా ఈ అప్లికేషల ద్వారా తెలియ చేస్తున్నారని…. ఇది కేవలం ఒక్క దేశ భద్రత గోప్యతలకు భంగం కలిగించే విధంగా రూపొందించబడ్డాయి…. అని అలాగే ఫారిన్ పాలసీ అంశాలను కూడా అతిక్రమిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగా ప్రభావం చూపే అప్లికేషన్లు అని ఆయన అన్నారు.

ఇక పోతే టిక్ టాక్ తో పోలిస్తే వి చాట్ యాప్ ను అమెరికన్లు భారీగా వాడుతారు. అలాగే అమెరికాలో ఉండే చైనీయులు కూడా దీనితోనే ఎక్కువగా ఒక్కరితో ఒకరు కనెక్ట్ అవుతుంటారు. ఇక టిక్ టాక్ కి ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో చాలా డిమాండ్ ఉంది. గూగుల్, యాపిల్ లాంటి కంపెనీలు దీనికి అనుసంధానమై ఉన్నారు. కానీ మొత్తానికి అమెరికా ఈ రెండు అప్లికేషన్స్ ను బ్యాన్ చేస్తూ చాలా పెద్ద సాహసమే చేసింది అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news