పసుపు రంగు ఫ్రాక్ లో పసిడిలా మెరిసిపోతున్న శ్రీముఖి..

యాంకర్ గా బుల్లితెరపై తిరుగులేని పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి, బిగ్ బాస్ షో ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకుంది. బుల్లితెర మీద యాంకర్ గా కనిపిస్తూ తన అందచందాలతో కుర్రళ్ల మతిపోగొడుతున్న శ్రీముఖి, అటు సినిమాల్లోనూ కనిపిస్తుంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా కనిపించింది. ఆ తర్వాత నేను శైలజ సినిమాలో రామ్ కి అక్కగా చేసింది. హీరోయిన్ కన్నా ఏమాత్రం తక్కువ గాని శ్రీముఖికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.

ఇప్పటి వరకూ శ్రీముఖి చాలా సినిమాలు చేసింది. కానీ నటిగా శ్రీముఖి గుర్తుండిపోయేంతగా ఒక్క పాత్ర కూడా పడలేదు. అప్పట్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పూర్తయి చాలా రోజులవుతున్నా రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు. ఐతే గత సంవత్సరం లేడీ ఓరియంటెడ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని శ్రీముఖి ప్లాన్ చేసింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఈ సినిమా నుండి అప్డేట్ కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ మరే అప్డేట్ బయటకి రాలేదు. సినిమాల గురించి అలా ఉంచితే టెలివిజన్ పై శ్రీముఖి దూసుకెళ్తుంది.

ఐతే యాంకర్ గా బిజీగా కొనసాగుతున్న ఈ అమ్మడు, సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, అప్డేట్లతో అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా శ్రీముఖి పంచుకున్న ఫోటోలు చూస్తుంటే, రోజు రోజుకీ తన అందం పెరుగుతుందేమో అనిపిస్తుంది. పసుపు రంగు ఫ్రాక్ వేసుకున్న శ్రీముఖి, అందమైన కళ్ళతో ఫోటోకి ఫోజులిస్తుంటే చూడచక్కదనంగా ఉంది. పసుపు వర్ణంలో మెరిసిపోతూ పసిడి పంటగా కనిపిస్తుంది. చెవుల నుండి భుజానికి తగులుతున్న మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ముఖం మీదకి ఎగిరిపడ్తున్న ముంగురులు తన అందాన్ని మరింతగా పెంచాయి.